ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 23:39:44

సాంకేతికతతో చెడు ధోరణులు పెరిగాయి

సాంకేతికతతో చెడు ధోరణులు పెరిగాయి

  • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

‘ప్రస్తుతం పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగానే చెడు ధోరణులు ఎక్కువైపోయాయి’ అన్ని అన్నారు ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. నవీన్‌చంద్ర, నాగబాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిషన్‌ 2020’. కుంట్లూరు వెంకటేష్‌ గౌడ్‌, కె.వి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ రమేష్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. కరణం బాబ్జీ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘నేరాలకు పాల్పడినందుకు శిక్షలు ఎలా పడతాయో సినిమాల్లో చూపించాలి. అప్పుడే తప్పు చేస్తే శిక్షింపబడతామనే భయం అందరిలో ఉంటుంది. 

 ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి’ అని తెలిపారు.  సైబరాబాద్‌ కమీషనర్‌ సజ్జనార్‌ మాట్లాడుతూ ‘సమాజాన్ని, దేశాన్ని బాగు చేయాలంటే పోలీసులు, ప్రభుత్వంతో  సాధ్యంకాదు. ప్రజల వల్లే అది నెరవేరుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తూ మంచి చేయాలని తపనతో ఆలోచించినప్పుడే దేశం, సమాజం బాగుంటాయి’ అని పేర్కొన్నారు. బీహార్‌ సీఏం నితీష్‌కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన అంశాల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిదని, అందరిలో ఆసక్తిని కలిగిస్తుందని, త్వరలో ఓటీటీ ద్వారా విడుదలచేస్తామని దర్శకుడు పేర్కొన్నారు. యువతరం ఎదుర్కొంటున్న  ప్రధాన సమస్యను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ గోపీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. logo