సోమవారం 06 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 20:19:43

‘కజ్ రా రే’ పాటలో ఎనర్జీ తగ్గింది ..కృతిసనన్ వీడియో

‘కజ్ రా రే’ పాటలో ఎనర్జీ తగ్గింది ..కృతిసనన్ వీడియో

అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కాంబోలో వచ్చిన కజ్ రా రే పాట ఏ స్థాయిలో మార్మోగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే పాటకు అందాల తార కృతిసనన్ ఓ ఈవెంట్ లో డ్యాన్స్ చేసింది. తనదైన హావభావాలతో కృతి గ్రూప్ సభ్యులతో కలిసి స్టేజీపై డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ..నృత్యప్రదర్శనలో ఎనర్జీ మిస్సయిందని కృతి తెలిపింది.

డ్యాన్స్ చేస్తుంటే కొంతమంది అరవడంతో టీం సభ్యుల మధ్య సమన్వయం లోపించిందని కృతిసనన్ పేర్కొంది.  డ్యాన్స్ పట్ల తనకున్న ప్రేమను తెలియజేస్తూ..#dancingistherapeutic, #danceyourheartout లను జోడించింది. 


 


logo