మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 11:11:00

ఓటీటీలో క్యూ క‌డుతున్న కీర్తి సురేష్ చిత్రాలు

ఓటీటీలో క్యూ క‌డుతున్న కీర్తి సురేష్ చిత్రాలు

మ‌హాన‌టి చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. ఆమె న‌టించిన మిస్ ఇండియా చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ప్ర‌స్తుతం రంగ్ దే, స‌ర్కారు వారి పాట చిత్రాల‌తో బిజీగా ఉంది. అయితే కీర్తి ఇటీవ‌ల గ్లామ‌రస్ చిత్రాల‌తో పాటు లేడి ఓరియొంటెడ్ చిత్రాలు చేస్తూ వ‌స్తుంది. 

కీర్తి లీడ్ రోల్‌లో తెర‌కెక్కిన పెంగ్విన్ చిత్రం కొద్ది రోజుల క్రితం ఓటీటీలో విడుద‌ల కాగా, ఇప్పుడు మెయిన్ లీడ్‌లో నటించిన మిస్ ఇండియా కూడా ఓటీటీ బాట‌ప‌ట్ట‌నుంది. నరేంద్ర నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మిస్ ఇండియా చిత్రం మ‌హేష్ కోనేరు నిర్మాణంలో రూపొంద‌గా, ఈ చిత్రం దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ రోజు ఉద‌యం 11గం.ల‌కు ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, చిత్రం న‌వంబర్ 4న నెట్ ఫ్లిక్స్ లో రానున్న‌ట్టు స‌మాచారం. ట్రైల‌ర్ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉండ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.