సోమవారం 25 మే 2020
Cinema - Feb 20, 2020 , 08:52:36

ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మిస్ ఇండియా

ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మిస్ ఇండియా

మ‌హాన‌టి చిత్రంతో నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ఇటు తెలుగు అటు త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తుంది. ఆ మ‌ధ్య  మిళంలో విశాల్ పందెం కోడి సీక్వెల్, సూర్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.అయితే ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.  అయితే తెలుగులో మిస్ ఇండియా టైటిల్ తో  కీర్తి సురేష్ ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమాతో మరోసారి లేడీ ఓరియేంటెడ్‌ పాత్రలో కనిపించబోతుంది కీర్తి. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై నందమూరి హీరోల పీఆర్వో మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్, నదియా, రాజేంద్రప్రసాద్, కమల్ కామరాజు, భానుశ్రీ మెహ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  నరేంద్ర అనే నూతనదర్శకుడు  ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో సినిమాని విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించిన యూనిట్ తాజాగా ఏప్రిల్ 17న మిస్ ఇండియాని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  మ‌రి  ఏప్రిల్ లో నాని, రామ్, అఖిల్, శర్వానంద్ సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకి రానున్నాయి.మరి వీరిని తట్టుకొని  కీర్తి సురేష్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఎంత‌టి వినోదాన్ని అందిస్తుంద‌నేది చూడాలి. 


logo