శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 24, 2021 , 18:07:58

స్టంట్ చేస్తుండ‌గా సంపూర్ణేశ్‌కు ప్ర‌మాదం..!

స్టంట్ చేస్తుండ‌గా సంపూర్ణేశ్‌కు  ప్ర‌మాదం..!

హృద‌య‌కాలేయం, సింగం 123, కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు సంపూర్ణేశ్‌బాబు. లాక్‌డౌన్ కాలంలో ఇంటిపట్టునే ఉండి త‌న వృత్తిప‌ని చేసుకుంటూ గ‌డిపిన సంపూ..మ‌ళ్లీ ఇపుడు త‌న కొత్త సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోయాడు. సంపూ న‌టిస్తోన్న కొత్త చిత్రం బజారు రౌడీ. ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ ను సంపూ స్వ‌యంగా చేస్తున్నాడు. సంపూ ఓ బైకు స్టంట్ చేస్తుండ‌గా ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.

స్టంట్ చేస్తున్న స‌మ‌యంలో బైకుకున్న కేబుల్ వైర్‌ బ్యాలెన్స్ త‌ప్ప‌డంతో సంపూ కింద‌ప‌డ‌గా..అదృష్ణ‌వ‌శాత్తు స్వ‌‌ల్ప గాయాల‌తో సంపూ బ‌య‌ట‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఆ వెంట‌నే సంపూర్ణేశ్ ప్రాథ‌మిక చికిత్స తీసుకున్న అనంతరం మ‌ళ్లీ స్టంట్ సీన్ ను పూర్తి చేశాడ‌ట. వృత్తిప‌ట్ల సంపూర్ణేశ్‌కున్న అంకిత‌భావాన్ని అంద‌రూ మెచ్చుకోవాల్సిందే.

ఇవి కూడా చ‌ద‌వండి..

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

దుబాయ్‌లో ఘ‌నంగా న‌మ్ర‌త బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ .. పిక్స్ వైర‌ల్

క‌థ డిమాండ్ చేస్తే గ్లామ‌ర్ షోకు రెడీ అంటున్న ప్రియ‌మ‌ణి

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

'నార‌ప్ప' డైరెక్ట‌ర్ కొత్త సినిమా ఇదే..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo