శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Feb 23, 2021 , 12:33:30

హీరో భార్య మ‌న‌సు గెలుచుకున్న డివిలియ‌ర్స్

హీరో భార్య మ‌న‌సు గెలుచుకున్న డివిలియ‌ర్స్

సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక సెలబ్రిటీల‌కు, అభిమానులకు మ‌ధ్య దూరం త‌గ్గింది. ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్’ అనే పేరుతో ఓ సెష‌న్ ఏర్పాటు చేసి ఆ సెష‌న్ లో అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికి స‌మాధానం ఇస్తూ వ‌స్తున్నారు. తాజాగా  బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ భార్య మీరా రాజ్‌పుత్  ఈ సెష‌న్‌లో ప‌లు విష‌యాలను పంచుకుంది.

ఓ నెటిజ‌న్ మీకు క్ర‌ష్ ఎవ‌రని ప్ర‌శ్నించ‌గా వెంటే సౌతాఫ్రికా క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ పేరు చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నాకు ఏబీ డివిలియ‌ర్స్ అంటే క్ర‌ష్‌, నేను అత‌నిని చాలా ఇష్ట‌ప‌డ‌తాను అని తెలిపింది.  ఇక నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ఏంటని అడిగిన ప్రశ్నకు.. ప్రముఖ కామెడీ షో ‘షిట్స్ క్రీక్’ అంటే ఇష్టమని ఆమె చెప్పారు. ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లో ఎవ‌రు గెలుస్తారు, మీ ఫ్యావ‌రేట్ ఫ్యామిలీ మెంబ‌ర్, ప్రగ్నెన్సీ త‌ర్వాత వెయిట్ ఎలా త‌గ్గారు, మీ నుదుటిపై మార్క ఎలా వ‌చ్చింది అనే ప్ర‌శ్న‌లు నెటిజ‌న్స్ అడ‌గ‌గా, వాటికి ఓపిక‌గా స‌మాధానాలు ఇచ్చింది. మీరా షాహిద్‌ను 2015లో వివాహం చేసుకోగా, ఈ దంప‌తుల‌కు  మిష, కొడుకు జైన్‌లు ఉన్నారు.  

VIDEOS

logo