మంగళవారం 07 జూలై 2020
Cinema - May 27, 2020 , 16:13:00

మంత్రి తలసానితో సినీ ప్రముఖుల భేటీ

మంత్రి తలసానితో సినీ ప్రముఖుల భేటీ

హైదరాబాద్‌:   సినిమా షూటింగ్‌లు, థియేటర్ల ఓపెనింగ్‌ తదితర అంశాలపై తెలుగు సినీ ప్రముఖులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు సి.కల్యాణ్‌, దిల్‌ రాజు, డైరెక్టర్‌ ఎన్‌.శంకర్‌, మా అధ్యక్షుడు నరేష్‌, ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్‌ రామ్మోహన్‌ రావు, జీవిత తదితరులు పాల్గొన్నారు.

'లాక్‌డౌన్‌తో సినిమా, టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ రంగాలపై ఆధారపడ్డ లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. షూటింగ్‌లు, థియేటర్ల ఓపెనింగ్‌పై చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్‌ పాలసీని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని' మంత్రి వివరించారు. 


logo