అబ్బో ఏం ఎండలు! ఈ ఎండలకు బయటకు పోవస్తలె ! ఉక్కపోతకు ఇంట్లో ఉండస్తలె !! ఈ ఎండలతో అల్లాడిపోయిన హైదరాబాద్ జనం వీకెండ్ కావడంతో జలవిహార్‌కు వెళ్లి ఇలా సేదతీరారు. నీటిలో ఆడుతూ, డ్యాన్సులు చేస్తూ సరదాగా గడిపారు. అలాగే చిన్న పిల్లలతో వచ్చిన తల్లులు కూడా.. తమ పిల్లలతో ఇలా నీటిలో ఆడుతూ కనిపించారు. ఈ ఎండలతో ఉడుకుతున్న ఆ చిన్ని ప్రాణానికి చల్లగా నీరు తగలడంతో ఆ చిన్నారులు కూడా కేరింతలు కొడుతూ ఆటలు ఆడారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ