గురువారం 09 జూలై 2020
Cinema - Apr 14, 2020 , 12:48:59

షారూఖ్ ఔదార్యానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి

షారూఖ్ ఔదార్యానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కరోనాపై పోరులో ప్రభుత్వాలకు చేయూతగా  పలు సేవా కార్యక్రమాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. పీఎం కేర్స్‌కు నిధులతో పాటు యాభైవేల రక్షణ కిట్ల పంపిణీ, ముంబయిలో 6000కుటుంబాలకు రోజువారి భోజన ఖర్చులు, ఢిల్లీలో 3000మందికి నిత్యవసరాల్ని సమకూర్చడం వంటి అనేక కార్యక్రమాలు ఆయన చారిటీలో ఉన్నాయి. వాటితో పాటు  ముంబయిలో కరోనా అనుమానితుల క్వారంటైన్‌ సదుపాయం కోసం నాలుగు అంతస్తుల తన ఆఫీస్‌ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించారు.

ఇక తాజాగా  మహారాష్ట్రలోని ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్‌ వర్కర్లకు తన వంతు సహాయంగా 25వేల పీపీఈ (పర్సనల్‌ ప్రొటక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్లను అందించాడు షారూఖ్‌. ఈ సంద‌ర్భంగా మహారాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజేష్ తోపే స్పందిస్తూ షారుక్‌కు ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ' థాంక్యూ షారుక్‌.. మీ వంతుగా 25వేల పీపీఈ కిట్లను అందించినందుకు ధన్యవాదాలు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న మెడికల్‌ సిబ్బందికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయంటూ' ట్విటర్‌లో పేర్కొన్నాడు.

మంత్రి ట్వీట్‌కి స్పందించిన షారూఖ్ .. ' నేనిచ్చిన కిట్లను హెల్త్‌ వర్కర్లకు వినియోగిస్తునందుకు మీకు ధన్యవాదాలు. క‌రోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ‌మంతా ఒక్క‌టైంది. ఇలాంటి ఆపత్కాల సమయంలో నా వంతుగా సహాయం చేశా. కరోనాను తరిమికొట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న వైద్య రంగం, వారి కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ రీట్వీట్‌ చేశాడు.


logo