శనివారం 04 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 09:49:42

ఓటీటీ టాక్‌ షోలో తమన్నా

ఓటీటీ టాక్‌ షోలో తమన్నా

హైదరాబా‌ద్‌ : శ్రీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ తమన్నాకి మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు తమన్నాని స్టార్ హీరోయిన్‌ను చేశాయి. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఐటెం సాంగ్స్ లో కనిపిస్తోంది. ఈ ఏడాది  'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో 'డాంగ్ డాంగ్' అంటూ అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తమన్నా త్వరలో ఓటీటీలోకి అడుగుపెడుతున్నట్టు సమాచారం. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్‌ అహా అనే ఓటీటీని ఇటీవ‌ల మొదలుపెట్టారు.

ఇందులో త‌మ‌న్నాతో స్పెషల్ గా ఓ టాక్ షో ని ప్లాన్ చేస్తున్నారని, ఇప్పటికే తమన్నాతో చర్చలు కూడా ముగిశాయని, దీనికి తమన్నా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో మొత్తం 20 ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారట. ఒక్కో ఎపిసోడ్‌కి తమన్నా రూ. 7 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్ హీరోలను తమన్నా ఇంటర్వ్యూ చేయబోతోందని సమాచారం.


logo