ప్రస్తుతం ముంబైని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సామాన్యుడితో పాటు సెలబ్రిటీలు కూడా వర్షం వలన వస్తున్న వరదలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరే వరకు టెన్షనే. తాజాగా సింగర్, ర్యాపర్ మికాసింగ్ కారు వరద నీటిలో చిక్కుకుంది. ఆ సమయంలో ఆయనతో పాటు ఆకాంక్ష పూరి కూడా ఉన్నారు.
ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి వస్తున్న సమయంలో మికా సింగ్ కారు వరద నీటిలో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు వెంటనే అక్కడకి చేరకొని సాయం చేశారు. వారి సాయంతో అక్కడ నుండి బయట పడ్డారు. దాదాపు 200 మంది వరకు జనాలు నాకు సాయం చేయడానికి వచ్చారు. వారందరికి నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు మికా సింగ్. ఆకాంక్ష పూరితో మికా సింగ్ డేటింగ్లో ఉన్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాను కుటుంబ సభ్యుడు వంటి వాడని, నాకు ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ఆకాంక్ష.