బుధవారం 03 జూన్ 2020
Cinema - May 21, 2020 , 10:43:16

వైర‌ల్‌గా మారిన మిహీకా బ‌జాజ్ టాటూ

వైర‌ల్‌గా మారిన మిహీకా బ‌జాజ్ టాటూ

భ‌ళ్ళాల‌దేవుడు లాక్‌డౌన్ స‌మ‌యంలో లాక్ అయిన‌ట్టు ప్ర‌కటించి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో త‌న ప్రేయ‌సి మిహీకాని వివాహం చేసుకోనున్నారు రానా. మే 20న ఇరుకుటుంబ స‌భ్యులు క‌లిసి ఎంగేజ్‌మెంట్‌, పెళ్లికి సంబంధించి మాట ముచ్చ‌ట జరిపారు.

డిసెంబ‌ర్‌లో లేదా వ‌చ్చే ఏడాది మొద‌ట్లో రానా వివాహం జ‌ర‌గ‌నుంది. కొద్ది రోజులుగా రానా, మిహీకాల పెళ్లి ఫోటోల‌తో పాటు వారి ప‌ర్స‌న‌ల్ విష‌యాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. తాజాగా మిహీకా టాటూ వైర‌ల్ అయింది. ఆమె త‌న చేతిపై  కాబోయే భర్త పేరులోని తొలి అక్షరమైన `R`ను, తన పేరులోని తొలి అక్షరమైన `M`ను లవ్ సింబల్‌తో కలిపి టాటూ వేయించుకుంది. ఈ ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. ఇది రానా ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది. 


logo