బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 21:51:20

మెహెందీ సెర్మ‌నీలో మెరిసిన మిహికా..ఫొటోలు

మెహెందీ సెర్మ‌నీలో మెరిసిన మిహికా..ఫొటోలు

హైద‌రాబాద్‌:  టాలీవుడ్ యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి-మిహికా బ‌జాజ్ ఈనెల 8వ తేదీన వివాహ‌బంధంతో ఒక్క‌ట‌వ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ లో భాగంగా ఇప్ప‌టికే మిహికా ఇంట్లో హల్దీ సెర్మ‌నీ నిర్వ‌హించారు. యెల్లో, గ్రీన్ లెహెంగాలో త‌ళుక్కున మెరిసింది మిహికా. ఇక ఇవాళ మిహికా ఇంట్లో మెహిందీ సెర్మ‌నీని నిర్వ‌హించారు. మెజెంటా లెహెంగా-గోల్డెన్ ఎంబ్రాయిడ‌రీ పొద‌గ‌బ‌డిన వ‌స్త్ర‌ధార‌ణ‌లో, ముత్యాలు, ట్రెండీ జ్యువెల్ల‌రీ ధ‌రించి మెరుస్తున్న ఫొటోలు ఇపుడు సోష‌ల్ మీడియాల‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

కరోనా ప్ర‌భావంతో రానా-మిహికా వివాహాన్ని నిరాండంబ‌రంగా రామానాయుడు స్టూడియోలో కేవ‌లం 30 మంది అతిథుల సమ‌క్షంలో జ‌రిపించేందుకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ స‌భ్యుల‌కి సంబంధించి కొద్ది మంది మాత్ర‌మే పెళ్ళికి హాజ‌రు కానున్నారు. శ్రేయోభిలాషులు, స‌న్నిహితుల‌ని కూడా ఆహ్వానించ‌డం లేదు. బ‌యో సెక్యూర్ వాతావ‌ర‌ణంలో పెళ్లి వేడుక‌ని నిర్వ‌హించ‌నుండ‌గా, అతిధులు త‌ప్ప‌ని స‌రిగా తగిన‌ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రించారు. 

పెళ్ళికి హాజ‌ర‌య్యే వారు కోవిడ్ 19 ప‌రీక్ష‌లు త‌ప్ప‌ని స‌రిగా చేయించుకోవాలి. తాము కూడా వేదిక ప‌రిస‌ర ప్రాంతాల‌లో శానిటైజ్ చేయించ‌డంతో పాటు అంద‌రు భౌతిక దూరం పాటించేలా త‌గు ఏర్పాట్లు చేస్తున్నాం అని ఇప్ప‌టికే సురేష్ బాబు పేర్కొన్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo