గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 15:01:55

చికంకారి సారీ లుక్ లో మిహికా బ‌జాజ్‌.,ఫొటో వైర‌ల్‌

చికంకారి సారీ లుక్ లో మిహికా బ‌జాజ్‌.,ఫొటో వైర‌ల్‌

ద‌గ్గుబాటి రానా భార్య మిహికా బ‌జాజ్..వెడ్డింగ్ సెల‌బ్రేషన్స్ షురూ అయిన‌ప్ప‌టి నుంచి ఏదో ఒక స్టిల్ తో సోష‌ల్ మీడియాలో అంద‌రినీ ఆక‌ర్షిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత తాజాగా మిహికా బ‌జాజ్ ఇంటి బాల్క‌నీపై సారీలో దిగిన ఫొటో ఒక‌టి ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌నీశ్ మ‌ల్హోత్రా డిజైన్ చేరిన చీర‌లో బాల్క‌నీలో నిల్చొని కెమెరా పోజులిచ్చింది మిహికా. చేనేత ఎంబ్రాయిడరీ, న‌డుము చుట్టూ క్లాత్ బెల్టుతో చికంకారి సారీ లుక్ లో మిహికా మెస్మ‌రైజ్ చేస్తూ చూపు ప‌క్క‌కు తిప్ప‌కోకుండా చేస్తుంది.

రానా-మిహికా బ‌జాజ్ ఆగ‌స్టులో వివాహ‌బంధంతో ఒక్క‌టైన విష‌యం తెలిసిందే. అత్యంత స‌న్నిహితులు, కుటుంబ‌స‌భ్యులు మాత్ర‌మే ఈ వేడుకకు హాజ‌ర‌య్యారు.  లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo