మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 10:21:45

మిహికా లెహంగాకి ప‌దివేల గంట‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ట‌..!

మిహికా లెహంగాకి ప‌దివేల గంట‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ట‌..!

ఆగ‌స్ట్ 8న మిహికా బ‌జాజ్..ద‌గ్గుబాటి వార‌సుడు రానాని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల‌లో అందరి దృష్టి మిహికా లెహంగాపై పడింది. గోల్డ్‌ మరియు క్రీమ్ కలర్‌లో ఎంతో అందంగా ఉన్న లెహంగా ప్ర‌తి ఒక్క‌రి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ లెహంగాపై ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు.

మిహికా ధ‌రించిన లెహంగాని ప్రముఖ డిజైనర్‌ అనామికా ఖన్నా డిజైన్ చేయ‌గా, దీని కోసం సుమారు ప‌దివేల గంట‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ట‌. లెహంగాలో జర్దొసి డిజైన్లను చికంకరి మరియు బంగారు లోహంతో చేశార‌ట‌. ఇంక‌ లెహెంగా కోసం బంగారు నేసిన దుపట్ట కూడా ఉంది. ఈ డ్రెస్‌లో మిహికా ఎంతో అందంగా క‌నిపిస్తుండ‌గా, ఆమె రానాకి స‌రైన జోడు అని నెటిజ‌న్స్ చెబుతున్నారు. రానా- మిహికా పెళ్లి రామానాయుడు స్టూడియోలో సింపుల్‌గా జ‌రిగింది. అంత‌క ముందు హ‌ల్దీ, మెహందీ వేడుక‌లు జ‌రిగాయి. మే 20న వీరి నిశ్చితార్ధం జ‌రిగిన విష‌యం తెలిసిందే.  


logo