మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 14:59:42

మిహికా హ‌ల్దీ సెర్మ‌నీ.. ఫోటోలు

మిహికా హ‌ల్దీ సెర్మ‌నీ.. ఫోటోలు

హైద‌రాబాద్‌:  టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి త‌న ప్రేయ‌సి మిహికా బ‌జాజ్‌ను ఈనెల 8వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే అప్పుడే మిహికా ఇంట్లో సంద‌డి మొద‌లైంది.  ఇవాళ మిహికా ఇంట్లో హ‌ల్దీ సెర్మ‌నీ నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా మిహికా కొత్త అందాల‌తో క‌నిపించింది. హ‌ల్దీ సెర్మ‌నీ ఫోటోల్లో  పెళ్లి కూతురు మిహికా ఓ బొమ్మ‌లా క‌వ్విస్తున్న‌ది.  ప‌సుపు ప‌చ్చ‌, ఆకుప‌చ్చ లెహంగాలో .. మిహికా మిళ‌మిళ మెరిసిపోయింది. ఇక స‌ముద్ర‌పు గ‌వ్వ‌ల జ్వ‌ల‌రీ ఆమెకు మ‌రింత అందాన్ని తెచ్చాయి.  

రానా-మిహికా వివాహాన్ని కరోనా వ‌ల‌న సాదాసీదాగా నిర్వ‌హించ‌నున్నారు.  రామానాయుడు స్టూడియోలో కేవ‌లం 30 మంది అతిథుల సమ‌క్షంలో పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ది. కుటుంబ స‌భ్యుల‌కి సంబంధించి కొద్ది మంది మాత్ర‌మే పెళ్ళికి హాజ‌రు కానున్నారు. శ్రేయోభిలాషులు, స‌న్నిహితుల‌ని కూడా ఆహ్వానించ‌డం లేదు. బ‌యో సెక్యూర్ వాతావ‌ర‌ణంలో పెళ్లి వేడుక‌ని నిర్వ‌హించ‌నుండ‌గా, అతిధులు త‌ప్ప‌ని స‌రిగా తగు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రించారు. 

పెళ్ళికి హాజ‌ర‌య్యే వారు కోవిడ్ 19 ప‌రీక్ష‌లు త‌ప్ప‌ని స‌రిగా జ‌రిపించుకోవాలి. మేం కూడా వేదిక ప‌రిస‌ర ప్రాంతాల‌లో శానిటైజ్ చేయించ‌డంతో పాటు అంద‌రు భౌతిక దూరం పాటించేలా త‌గు ఏర్పాట్లు చేస్తున్నాం అని సురేష్ బాబు పేర్కొన్నారు. మిహికా త‌ల్లి కూడా జాగ్ర‌త్త‌ల విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌ట్లేదు అని పేర్కొన్నారు. 



logo