ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 13:16:58

ఓటీటీలో ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’?

ఓటీటీలో ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’?

యువ నటుడు ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. చిత్రం గుంటూరు నేపథ్యంలో సాగనుంది. ఇందులో వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తోంది. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్‌’లో జనార్ధన్ పసుమర్తి కథ, సంభాషణలు రాయగా.. వెనిగళ్ల ఆనంద ప్రసాద్ నిర్మించారు. ఆనంద్ దేవరకొండ నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో చిత్రానికి సంబంధించి మేకర్స్‌ విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీ ప్రధాన పార్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరించారు. ఇటీవల వెనిగళ్ల ఆనంద ప్రసాద్ మీడియాతో సంభాషించారు. చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తి చేసినట్లు వెల్లడించారు. ‘దొరసాని’కి పూర్తి భిన్నమైన పాత్రలో ఆనంద్‌ కనిపిస్తాడని, వినోదంతో పాటు అందమైన ప్రేమకథ మిళితమై ఉంటుందని ప్రకటించారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వెనిగళ్ల ఆనందప్రసాద్‌ నిర్మిస్తుండగా.. వినోద్‌ అనంతోజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo