డ్రగ్స్ ఎంతమంది జీవితాలని చిన్నాభిన్నం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్రగ్స్ మత్తులో ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. తాజగా హాలీవుడ్ సీనియర్ నటుడు మికాయిల్ కెన్నెత్ విలియమ్స్(54) డ్రగ్స్‌కు బానిసై కన్నుమూశాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన ఆయన మృతిని పోలీసులు ధృవీకరించారు.
హెచ్‌బీవో బ్లాక్‌బస్టర్ డ్రామా ‘ది వైర్’లో ఒమర్ లిటిల్ క్యారెక్టర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న మికాయిల్ బ్రూక్లిన్ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్నారు. రెండురోజులుగా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో దగ్గరి బంధువు ఒకరు సోమవారం మైకేల్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూశారు. డ్రగ్స్ ప్యాకెట్స్ మధ్య విలియమ్స్‌ని చూసి పోలీసులకి సమాచారం అందించారు.
ఓవర్ డోస్ తీసుకోవడం వలనే మికాయిల్ చనిపోయినట్టు పరీక్షలో తేలింది. టీవీ ఆడియన్స్‌ని ఎంతగానో అలరించిన ఆయన ఐదుసార్లు ప్రైమ్‌టైం ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఒమర్ లిటిల్ క్యారెక్టర్‌తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు.కొన్నాళ్ల క్రితం భార్య చనిపోగా, ఒంటరిగా ఉంటున్నాడు. ఆ క్రమంలో డ్రగ్స్‌కి అలవాటయ్యాడు.ఆ మధ్య డ్రగ్స్ నుండి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నాడు. 1996లో ‘బుల్లెట్’ మూవీ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టి.. ఓవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెరపైనా రాణించాడు
మికాయిల్ కె విలియమ్స్.. భార్య చనిపోయాక కొడుకుతో ఉంటున్నారు. అయితే కొన్ని నెలలుగా ఆయన డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ అలవాటు గురించి ప్రస్తావించి.. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారాయన. ‘చాకీ, బ్రాడ్‌వాక్ ఎంపైర్, బెస్సీ, 12 ఇయర్స్ ఏ స్లేవ్’ లాంటి సినిమాలతో ప్రేక్షకులని అలరించాడు.ఆయన మృతికి హాలీవుడ్ పరిశ్రమ సంతాపం తెలియజేస్తుంది.