శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 17, 2021 , 17:30:56

అర‌వింద్‌స్వామి‌-కంగ‌నా రొమాంటిక్ లుక్‌..' త‌లైవి' పోస్ట‌ర్

అర‌వింద్‌స్వామి‌-కంగ‌నా రొమాంటిక్ లుక్‌..' త‌లైవి'  పోస్ట‌ర్

బాలీవుడ్ న‌టి కంగ‌నారనౌత్ లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న చిత్రం త‌లైవి. దివంగ‌త త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, సినీ న‌టి జ‌య‌ల‌లిత జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏఎల్ విజ‌య్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎంజీఆర్ పాత్ర‌లో అర‌వింద్ స్వామి న‌టిస్తున్నాడు. ఇవాళ ఎంజీఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని త‌లైవి మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ఎంజీఆర్-జ‌య‌ల‌లిత మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాన్ని లేటెస్ట్ లుక్ లో చూపించారు.

చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంతో..ఎంజీఆర్ వీరాభిమానులు త‌మిళ‌నాట సంబురాలు చేసుకుంటున్నారు. తలైవి షూటింగ్ ను గ‌త నెల‌లోనే పూర్తి చేసింది ఏఎల్ విజ‌య్ టీం. ఇక వ‌రుస‌గా తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నాడు విజ‌య్‌. విబ్రి మీడియా-క‌ర్మ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్స్ పై విష్ణు వ‌ర్థ‌న్ ఇందూరి, శైలేశ్ ఆర్ సింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు జీవీ ప్ర‌కాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo