శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 19:37:00

విష‌మంగా ఎస్పీ బాలు ఆరోగ్యం

విష‌మంగా ఎస్పీ బాలు ఆరోగ్యం

ప్ర‌ముఖ‌ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితిపై చెన్నై ఎంజీఎం ఆస్ప‌త్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. ఎస్పీ బాలు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు వైద్యులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌రోనాతో బాధ‌ప‌డుతూ ఎస్పీ బాలు ఆగ‌స్టు 5న ఎంజీఎం హెల్త్ కేర్ లో చేరారు. గ‌త 24 గంట‌ల్లో బాలు ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. బాలుకు ఎక్మో, వెంటిలేట‌ర్ పై చికిత్స‌నందిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఎస్పీ బాలు 40 రోజులుగా ఎంజీఎం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 19 నుంచి బాలు ఆరోగ్యంపై ఆస్ప‌త్రి వ‌ర్గాలు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేయలేదు. 

బాలు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మిస్తుంద‌న్న వార్త‌ల‌తో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. బాలు త్వ‌ర‌గా కోలుకుని క్షేమంగా తిరిగిరావాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.