మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 20:23:43

మీటూ ఉద్యమానికి టార్చ్‌ బేరర్‌ తనుశ్రీ దత్తా

మీటూ ఉద్యమానికి టార్చ్‌ బేరర్‌ తనుశ్రీ దత్తా

న్యూ ఢిల్లీ : బాలీవుడ్‌లో మీటూ ఉద్యమానికి టార్చ్ బేరర్‌గా నటి తనుశ్రీ దత్తా ప్రశంసలు అందుకున్నారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ఆమె న్యాయవాది నితిన్ సత్పుటే స్పందించారు. 34 ఏళ్ల గత నెల 14న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తనుశ్రీ దత్తా తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ ప్రాథమికంగా సుశాంత్‌ కేసు ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ ప్రతి రోజు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయని, నిజం తెలుసుకునేందుకు సరైన దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందన్నారు.

ఈ సంఘటన తర్వాత నెపోటిజం, అభిమానం చర్చనీయాంశాలుగా మారాయన్నారు. 2007లో తనుశ్రీ దత్తాను లైంగికంగా వేధించారు.. కానీ 2017లో కేసు నమోదు చేశారని చెప్పారు. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె సొంతంగా పోరాటం చేసిందని గుర్తు చేశారు. అలాగే విచారణ సమయంలో సుశాంత్ ఆత్మహత్యకు గురైనట్లు బయటకు వస్తే, దీనివెనుక ఉన్న వారిని శిక్షించాలన్నారు. సుశాంత్‌ కేసులు నిజం తెలుసుకునేందుకు, ఎవరైనా తనను కార్నర్‌ చేయడానికి ప్రయత్నించారా? లేదా నెపోటిజంకు గురయ్యాడా? అని చాలామంది తనను సంప్రదించారని నితిన్‌ తెలిపారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo