శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 23:45:48

త్రినాథ్‌ వెలిసెల రూపొందించిన ‘మేకసూరి’

 త్రినాథ్‌ వెలిసెల రూపొందించిన ‘మేకసూరి’

‘వైవిధ్యమైన కథాంశంతో... విభిన్నమైన సినిమాని తెరకెక్కించావు. తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి సహజమైన కథతో సినిమా రాలేదు అంటున్నారు.  సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు’ అన్నారు దర్శకుడు త్రినాథ్‌ వెలిసెల. ఆయన దర్శకుడిగా రూపొందించిన తొలి సినిమా ‘మేకసూరి’. ఈ చిత్రం తొలిభాగాన్ని ఇటీవల జీ5 ఓటీటీలో విడుదల చేశారు. అభినయ్‌, సమయ ముఖ్యపాత్రల్లో కార్తీక్‌ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ ప్రత్యేకంగా ఓటీటీ  కోసమే చేసిన సినిమా ఇది. గ్రామీణ నేపథ్యంలో జరగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతి పాత్ర సహజంగానే వుంటుంది.  తాను ప్రేమించి పెళ్లాడిన భార్యను హత్య చేసిన వాళ్లపై కసాయి సూరి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడనేది ఈ చిత్ర కథాంశం. సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేయాలనే మా ఆలోచనకు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే రెండోభాగం విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని తెలిపారు.  logo