ఇటీవల పెళ్లికి పచ్చజెండాలు ఊపిన తారలు.. నిశ్చితార్థం జరుపుకున్న తరువాత పలు కారణాలతో ఆ నిశ్చితార్థం వేడుకను రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో అందాలతార మెహరీన్ పిర్జాదా కూడా చేరారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో గత మార్చిలో జైపూర్‌లో మెహరీన్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు మెహరీన్ స్వయంగా సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. ఇరువురు ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది. ఇక నుంచి భవ్య బిష్ణోయ్‌తో పాటు వారి కుటుంబసభ్యులతో తనకు ఎలాంటి సంబంధం వుండబోదని తెలిపింది. తన ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని..ఇక నుంచి సినిమాలతో అభిమానులను మరింత అలరిస్తానని చెప్పింది మెహరీన్.