హీరోలకు ప్రాణం అంటే అభిమానులే. ఎలాంటి లాభం ఆశించకుండా ప్రేమించేది వాళ్లు మాత్రమే. అందుకే మీ రుణం తీర్చుకోలేం అని ఎప్పుడూ చెప్తుంటారు అభిమానులు. హీరోలు కూడా అభిమానులను అంతే ప్రేమిస్తుంటారు. తమ ఫ్యాన్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం తన అభిమానికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. యంగ్ టైగర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు మరో నాలుగైదు సినిమాలు కూడా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
అంత బిజీగా ఉన్నా కూడా టైమ్ తీసుకుని మరీ అభిమానులను కలుస్తూనే ఉంటాడు తారక్. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కోసం టైమ్ కేటాయిస్తుంటాడు. వాళ్లనే స్వయంగా వెళ్లి కలిసి వస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇలాంటిదే చేసాడు జూనియర్. అయితే వాళ్లు వచ్చి కలిసినపుడు అద్భుతమైన స్వాగతం కలిపాడు. అంతేకాదు తన వీరాభిమాని ఇచ్చిన పెళ్లి పత్రికను తీసుకుని వాళ్లతోనే కాసేపు సమయం గడిపాడు. బాగోగుల గురించి తెలుసుకున్నాడు. తప్పకుండా వస్తానంటూ మాటిచ్చాడు. వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అక్కడ ఎన్టీఆర్ ను కలిసి పత్రిక ఇచ్చింది కూడా ఎవరో కాదు.. స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కన్వీనర్ భాస్కర్ చౌదరి. ఆయన కొడుకు పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడానికి వచ్చాడు భాస్కర్. పెళ్లి కార్డు పట్టుకొని కుటుంబ సమేతంగా తారక్ ఇంటికి వచ్చాడు ఈయన. వాళ్లతో కూర్చుని మాట్లాడాడు యంగ్ టైగర్. ఇందులో ఎన్టీఆర్ చాలా సింపుల్ గానే ఉన్నాడు. కోవిడ్ కారణంగా ఎన్టీఆర్ ఖరీదైన బ్లాక్ మాస్క్ ధరించాడు. మరోవైపు తారక్ ను కలవడానికి వచ్చిన వాళ్లు కూడా మాస్క్ పెట్టుకున్నారు. పెళ్లికి తప్పకుండా వస్తానని మాటిచ్చినట్లు తెలుస్తుంది.