శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Cinema - Sep 17, 2020 , 12:51:45

డ్యాన్స్ తో టాప్ లేపిన మోహ‌బూబ్‌, హారిక‌

డ్యాన్స్ తో టాప్ లేపిన మోహ‌బూబ్‌, హారిక‌

మంగ‌ళ‌వారం బీబీ టీవీ టాస్క్ తో కాస్త ఎంట‌ర్ టైనింగ్ గా సాగిన ఎపిసోడ్‌..బుధ‌వారం కూడా కొన‌సాగింది. ఉద‌యాన్నే మోనాల్ కోసం అఖిల్ కారం దోస వేయించుకుని తీసుకొచ్చాడు..అయితే మోనాల్‌కు మాత్రం తినిపించ‌లేక‌పోయాడు. అఖిల్ స్థానంలో అభిజిత్ వ‌చ్చి కూర్చోగా..అఖిల్ వెన‌క్కితిరొగొచ్చాడు. ఇంత‌లోనే మోనాల్‌కు ద‌గ్గు వ‌చ్చింది. అభిజిత్ నీళ్లు తీసుకొద్దామ‌ని వెళ్లినా..అఖిల్ ముందుగా మోనాల్ కు నీళ్లు అందించాడు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికి మోనాల్ అఖిల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఆలోచించి మాట్లాడాల‌ని కెమెరాలు చూస్తున్నాయ‌ని అఖిల్‌సూచించాడు. అభిజిత్ ఏమైనా చెప్తే ఆ విష‌యం త‌న‌కు చెప్పొద్ద‌ని మోనాల్ కు చెప్పాడు అఖిల్‌. 

ఇక అఖిల్‌, మోనాల్‌, అభిజిత్ మ‌ధ్య ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ మ‌లుపులు తిరుగుతుంది. అఖిల్‌, మోనాల్ మ‌ధ్య ఏదో ఉంద‌ని సుజాత్‌, లాస్క అనుకుంటున్నారు. మోనాల్ సోహైల్ తో క‌లిసి డ్యాన్ష్ చేస్తున్న‌పుడు అఖిల్‌, అభిజిత్ ముఖంలో క‌నిపిస్తున్న హావభావాల‌ను ఇద్ద‌రూ గ‌మ‌నిస్తున్నారు. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రు నీతో ఉండం వ‌ల్లే తాము నీతో క‌ల‌వ‌లేక‌పోతున్నామ‌ని సుజాత‌, లాస్య మోనాల్‌కు చెప్ప‌గా..మోనాల్ ఇదే విషయాన్నిఅఖిల్ తో చెప్పింది. మ‌నం క‌లిసి టైం కేటాయిస్తున్నందుకు వారికి క‌ష్టంగా అనిపిస్తుందట‌‌. మ‌నం స్నేహితులం క‌దా. కానీ వాళ్లు ఏదో అనుకుంటున్నార‌ని అఖిల్ తో చెప్పుకొచ్చింది మోనాల్‌. 

బీబీ టీవీ టాలెంట్ షో


బిగ్ బాస్ ఇచ్చిన బీబీ టీవీ టాస్క్ లో భాగంగా బుధ‌వారం బీబీ టాలెంట్ షో జ‌రిగింది. ఈ షోలోకు అరియానా యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌గా..నోయ‌ల్‌, లాస్క జడ్జిగా లుగా వ్య‌వ‌హ‌రించారు. డ్యాన్ష్ ఫ్లోర్ పై మొద‌ట అమ్మ‌రాజ‌శేఖ‌ర్ ఎంట్రీ ఇచ్చి సినిమా చూపిస్త మామా అంటూ డ్యాన్స్ ఇర‌గ‌దీశాడు. డ్యాన్స్ మ‌ధ్య‌లో దివి, క‌రాటే క‌ళ్యాణి స్టేజీపైకి వ‌చ్చి మెరిశారు. అనంత‌రం సోహైల్‌, మోనాల్ వానా వానా వెల్లువాయే సాంగ్ అద‌రిపోయే స్టెప్పులేశారు. హాట్ ఫ‌ర్మామెన్స్ అంటూ నోయల్ చొక్కా విప్పేశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన యాడ్ లో క‌ళ్యాణి, అభిజిత్‌, దేవి నాగ‌వల్లి, అఖిల్ బ‌మ్‌చిక్ ఫ్యాన్‌కు క్యాంపెయిన్ చేశారు.


టాప్ లేపి..అవార్డులు గెలుచుకున్నారు

యాడ్ త‌ర్వాత మోహ‌బూబ్‌, హారిక టాప్ లేచిపోద్ది అంటూ సాగే మాస్ సాంగ్‌కు డ్యాన్ష్ చేసి అంద‌రి చేత ఈల‌లు వేయించారు. ఊర మాస్ స్టైల్ ఈ జంట త‌మ డ్యాన్స్ తో అమ్మ‌రాజ‌శేఖ‌ర్‌ను వెనక్కునెట్టి స్టార్ ఫ‌ర్ఫ్‌ర్మార్ ఆఫ్ ది షో అవార్డులు గెలుచుకున్నారు. మ‌రోవైపు గంగ‌వ్వ మీ ఆరు గుర్రాలు, మా ఆరు గుర్రాలు పాట పాడి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంది. టాలెంట్ షో అయిపోగానే కంటెస్టంట్ల‌తా ఒక్క‌చోట చేరి డ్యాన్స్ చేశారు. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వ‌చ్చిన కంటెస్టంట్ హౌస్ లో యాక్టివ్ గా లేక‌పోవ‌డంతో..ఇదే వారంలో రెండో వైల్డ్ కార్డు ఎంట్రీకి అవ‌కాశ‌మివ్వ‌నున్నాడుబిగ్‌బాస్‌. మ‌రో కొత్త కంటెస్టంట్ బిగ్ బాస్ హౌజ్ లో సంద‌డి చేయ‌నున్నాడన్న‌మా‌ట‌. నెక్ట్స్ ఎపిసోడ్ లో ఆ కొత్త కంటెస్టెంట్ ఎవ‌రో తెలియ‌నుంది. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo