మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 15, 2020 , 11:16:39

బిగ్ బాస్ 4 తెలుగు నుంచి మెహబూబ్ ఔట్.. ఇదిగో ప్రూఫ్

బిగ్ బాస్ 4 తెలుగు నుంచి మెహబూబ్ ఔట్.. ఇదిగో ప్రూఫ్

బిగ్ బాస్ ఇంటి గురించి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని సస్పెన్స్ వీడిపోయింది. అందరూ అనుకున్నట్టుగానే ఈ వారం మెహబూబ్ ను ఇంటికి పంపించేశారు. ఈయన ఎలిమినేషన్ అందరూ ఊహించిందే. కాకపోతే చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరగకపోదా అని వేచి చూశారు ప్రేక్షకులు. కానీ వాళ్ళ ఆశలు ఫలించలేదు. మోనాల్ ఈ వారం ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో బాగానే వార్తలు వచ్చాయి. ఇప్పటికే కొన్ని వారాల నుంచి ఆమెను కావాలనే సేవ్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దాంతో ఈ వారం ఖచ్చితంగా ఇంటికి పంపించేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అది బిగ్ బాస్.. అక్కడ ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. 

అందుకే ఈ వారం కూడా మోనాల్ గజ్జర్ సేఫ్ జోన్ కు వెళ్లిపోయింది. ఇక నామినేషన్స్ లో ఉన్న సోహైల్, అరియానా కూడా సేవ్ అయ్యారు. చివరగా మెహబూబ్ ఒక్కడే మిగిలాడు. ఈయనకు ఈ వారం ఓట్లు తక్కువగా రావడంతో ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించాడు. దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత వెంటనే రాహుల్ సిప్లిగంజ్ తో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. బిగ్ బాస్ బజ్ అంటూ అక్కడ జరిగిన ముచ్చట్లను రాహుల్ తో పంచుకొంటారు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదలైంది. 

అక్కడ మెహబూబ్ తో ఇంటర్వ్యూ చేస్తున్నాడు రాహుల్ సిప్లిగంజ్. మూడు వారాల కింద దివి ఫోటో కూడా ఇలాగే బయటికి వచ్చింది. అసలు ఆ వారం ఆమె బయటకు వస్తుందని ఎవరూ కనీసం ఊహించలేదు. కానీ ఊహించనిదే అక్కడ జరిగింది. ఈ వారం కూడా ఇదే జరగబోతుంది. అందరూ కచ్చితంగా మెహబూబ్ సేవ్ అవుతాడని అనుకున్నారు.. కానీ ప్రేక్షకులు మాత్రం మరోలా తీర్పునిచ్చారు. ఇప్పటికే 11 వారాలు అయిపోవడంతో గేమ్ మరింత కఠినంగా మారుతుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. మిగిలిన వాళ్లకు గుడ్ బై చెప్పేస్తున్నారు ఆడియన్స్. ఈ క్రమంలోనే ఈ వారం మెహబూబ్ బ్యాగ్ సర్దుకున్నాడు.


logo