శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 13:11:47

చిరంజీవి స‌ర్జ శ్రీమ‌తి సీమంతం వేడుక జ‌రిపిన ఫ్రెండ్స్

చిరంజీవి స‌ర్జ శ్రీమ‌తి సీమంతం వేడుక జ‌రిపిన ఫ్రెండ్స్

ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు చిరంజీవి స‌ర్జ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతి అభిమానుల‌తో పాటు కుటుంబ స‌భ్యుల‌కు తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. అయితే చిరంజీవి మృతి చెందిన స‌మ‌యంలో ఆయ‌న భార్య మేఘ‌నా రాజ్ గ‌ర్భ‌వ‌తి. రీసెంట్‌గా కుటుంబ స‌భ్యులు ఆమె సీమంతం వేడుక‌ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో మేఘ‌నా రాజ్ కూర్చున్న కుర్చీ ప‌క్క‌న దివంగ‌త న‌టుడు చిరు కటౌట్‌ని ఉంచి ఆయ‌న లేని లోటును తీర్చారు. వేడుక‌కు కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హాజ‌రయ్యారు.

తాజాగా మేఘ‌నా రాజ్ సీమంతం వేడుకుల‌ని ఆమె స్నేహితులు జ‌రిపారు. ఈ వేడుక‌లో మేఘ‌నా ఫుల్ లెంగ్త్ గౌన్‌లో మెరిసింది. ఈ వేడుక‌లోను మేఘ‌నా పక్క‌న చిరు క‌టౌట్‌ని ఉంచారు. ఆ క‌టౌట్‌తో మేఘ‌నా ఫోటోల‌కి ఫోజులిచ్చింది. ఆ ఫోటోల‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మేఘ‌నా.. కొంద‌రు వారిని స్నేహితులు అంటారు, కాని వారు జీవితంలో ప్ర‌త్యేకంగా నిలిచిపోతారు అని తెలిపింది. కాగా, కథానాయిక మేఘనారాజ్‌తో పదేళ్లు ప్రేమాయణం సాగించిన చిరంజీవి సర్జా 2018లో మేఘ‌నా రాజ్‌ను వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.