శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 12:01:26

చిరంజీవి స‌ర్జా జ‌యంతి.. భావోద్వేగ‌పు పోస్ట్ పెట్టిన మేఘ‌నా

చిరంజీవి స‌ర్జా జ‌యంతి.. భావోద్వేగ‌పు పోస్ట్ పెట్టిన మేఘ‌నా

క‌న్న‌డ హీరో చిరంజీవి స‌ర్జా జూన్ 7న‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతి అతని భార్య మేఘనారాజ్‌ని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. చిరంజీవి మ‌ర‌ణించే స‌మ‌యంలో మేఘనారాజ్ గర్భవతి కావడంతో..తండ్రి కాబోతున్నానని ఆనందంలో మునిగిపోయిన ఆయ‌న అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. భర్త కంటే ఎక్కువగా ఓ మంచి వ్యక్తిగా చిరంజీవి సర్జా మరణాన్ని తట్టుకోలేకపోతుంది మేఘానారాజ్. చిరంజీవి సర్జాను గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో త‌ర‌చు పోస్ట్‌లు షేర్ చేస్తుంది.

త‌న భ‌ర్త చిరంజీవి స‌ర్జ జ‌యంతి సంద‌ర్భంగా మేఘ‌నా భావోద్వేగ‌పు పోస్ట్ షేర్ చేసింది. హ్యాపీ బ‌ర్త్‌డే మై వ‌ర‌ల్డ్‌..చిరు ఐ ల‌వ్ యూ.. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో ఉన్న చిరంజీవి ఫోటోని షేర్ చేసింది. మేఘ‌నా పోస్ట్‌కు నెటిజ‌న్స్.. జ‌యంత్సుత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ మిస్ యూ అన్నా అని కామెంట్స్ పెడుతున్నారు. మ‌రోవైపు చిరు జ‌యంతి సంద‌ర్బంగా ఆయ‌న న‌టించిన శివార్జున చిత్రాన్ని క‌ర్ణాట‌క‌లో రీరిలీజ్ చేయ‌బోతున్నారు.

చిరంజీవి మృతి చెందిన స‌మ‌యంలో ఆయ‌న భార్య మేఘ‌నా రాజ్ గ‌ర్భ‌వ‌తి కాగా, రీసెంట్‌గా కుటుంబ స‌భ్యులు ఆమె సీమంతం వేడుక‌ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో మేఘ‌నా రాజ్ కూర్చున్న కుర్చీ ప‌క్క‌న దివంగ‌త న‌టుడు చిరు కటౌట్‌ని ఉంచి ఆయ‌న లేని లోటును తీర్చారు. వేడుక‌కు కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హాజ‌రయ్యారు. ఆ త‌ర్వాత‌ మేఘ‌నా రాజ్ సీమంతం వేడుకుల‌ని ఆమె స్నేహితులు కూడా జ‌రిపారు. ఈ వేడుక‌లో మేఘ‌నా ఫుల్ లెంగ్త్ గౌన్‌లో మెరిసింది. ఈ వేడుక‌లోను మేఘ‌నా పక్క‌న చిరు క‌టౌట్‌ని ఉంచారు. ఆ క‌టౌట్‌తో మేఘ‌నా ఫోటోల‌కి ఫోజులిచ్చింది