మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Jul 08, 2020 , 12:09:05

న‌టికి చుక్క‌లు చూపించిన వీధి కుక్క‌లు

న‌టికి చుక్క‌లు చూపించిన వీధి కుక్క‌లు

లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌లంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమితం కావ‌డంతో వీధుల్లో కుక్క‌లు వీర‌విహ‌రం చేశాయి. అత్య‌వ‌స‌ర పని మీద ఎవ‌రైన బ‌య‌ట‌కి వెళితే వారిని భ‌యాందోళ‌న‌కి గురి చేశాయి. రీసెంట్‌గా హిందీ టీవీ న‌టి మేఘా గుప్తా జాగింగ్‌కి వెళ్ళి తిరిగి ఇంటికి వ‌స్తుండ‌గా, ఆరు కుక్క‌లు ఆమెని వెంబ‌డించాయ‌ట‌. రెండింటిని త‌రిమి కొట్టిన‌ప్ప‌టికీ, మిగ‌తావి మాత్రం ఆమెకి చుక్క‌లు చూపించాయ‌ని చెప్పుకొచ్చింది.

మేఘా గుప్తా వ్యాయామం కోసం మంచి ప్ర‌దేశానికి వెళ్లింది. అక్క‌డ కొన్ని వ్యాయామాలు చేసి ఇంటికి ర‌న్నింగ్ చేస్తూ వ‌స్తుండ‌గా, కుక్క‌లు వెంబ‌డించాయ‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చింది. అటుగా స్కూట‌ర్ మీద వ‌చ్చిన వ్యక్తి త‌న‌ని కాపాడార‌ని, ఆయ‌న లేకుంటే నా ప‌రిస్థితి ఏమ‌య్యేదో అంటూ త‌ను అనుభ‌వాన్ని వివ‌రించింది మేఘా .

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo