శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 21:22:49

నలుగురు దర్శకులతో చిరంజీవి..నెక్స్ట్ ఫెంటాస్టిక్ 4 వీళ్ళే..!

నలుగురు దర్శకులతో చిరంజీవి..నెక్స్ట్ ఫెంటాస్టిక్ 4 వీళ్ళే..!

చిరంజీవి ఫాస్ట్ చూస్తుంటే కుర్ర హీరోలు కూడా కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఈయన వరుసగా కమిట్ అవుతున్న సినిమాలు అలా ఉన్నాయి మరి. అయితే ఇన్ని రోజులు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అనే విషయంపై ఉన్న కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఇప్పుడు ఒకేసారి నాలుగు సినిమాలు.. నలుగురు దర్శకులతో పని చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు మెగాస్టార్. ప్రస్తుతం నటిస్తున్న ఆచార్యతో పాటు తర్వాత చేయబోయే మూడు సినిమాలకు సంబంధించిన దర్శకులతో ఫోటో దిగి ట్వీట్ చేశాడు చిరంజీవి. అంతేకాదు మై కెప్టెన్స్ ఈ నలుగురు.. ఫెంటాస్టిక్ 4.. చార్ కదమ్.. అంటూ నలుగురు తో దిగిన ఫోటోలు అభిమానులతో షేర్ చేశాడు మెగాస్టార్. 

అందులో కొరటాల శివ, మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబీ ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివతో ఆచార్య సినిమా చివరి దశకు వచ్చేసింది. ఆ తర్వాత లూసిఫర్ రీమేక్ బాధ్యతలు మోహన్ రాజా తీసుకున్నాడు. మరోవైపు వేదాళం రీమేక్ బాధ్యతలు మెహర్ రమేష్ తీసుకున్నాడు. ఈ మూడు సినిమాలు చిరు చేస్తున్నట్లు అందరికీ తెలుసు. అయితే బాబీ సంగతి మాత్రం ఇప్పుడే కన్ఫర్మ్ చేశాడు మెగాస్టార్. వెంకీ మామ తర్వాత మరో సినిమా కమిట్ అవ్వని బాబీ..చిరు కోసం ఒక కథ సిద్ధం చేశాడు. ఈ విషయం అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు చిరంజీవి. అయితే అది అప్పటికి పూర్తిగా మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి కావడంతో బాబీ సినిమా అనౌన్స్ చేశాడు మెగాస్టార్. 

ఇది పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు అదిరిపోయే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కథను బాబి సిద్ధం చేయడంతో ఆయనతో సినిమా చేయడానికి మెగాస్టార్ వెంటనే ఒప్పుకున్నాడు. రాబోయే రెండు సంవత్సరాలలో చిరంజీవి నుంచి నాలుగు సినిమాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. 2021లో ఆచార్యతో పాటు లూసిఫర్ రీమేక్ కూడా విడుదల కానుంది. ఈ సినిమాకు బైరెడ్డి అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక 2022లో వేదాళం రీమేక్ బాబి సినిమాలు విడుదల కానున్నాయి. ఏదేమైనా మెగాస్టార్ స్పీడ్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

సూర్య‌-బోయ‌పాటి కాంబోలో సినిమా..!

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo