శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 19:54:26

న‌య‌న‌తార కోసం చిరంజీవి వెయిటింగ్‌..!

న‌య‌న‌తార కోసం చిరంజీవి వెయిటింగ్‌..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్ ఇటీవ‌లే గ్రాండ్ గా మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆచార్య షూటింగ్ పూర్త‌వ‌గానే ఈ ప్రాజెక్టు చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌నున్నాడు చిరు. డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ఈ చిత్రంలో ఫీమేల్‌లీడ్ ఎవ‌ర‌నే విష‌యంపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. ఒరిజిన‌ల్ వెర్షన్ లో మంజువారియ‌ర్ పోషించిన పాత్ర‌లో న‌య‌న‌తార క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే మేక‌ర్స్ మాత్రం పేరు ప్ర‌క‌టించ‌లేదు.

డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ఈ రోల్ కోసం న‌య‌న‌తార‌ను సంప్ర‌దించిన‌ట్టు ఇన్‌సైడ్ టాక్‌. కానీ న‌య‌న్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ రాన‌ట్టు తెలుస్తోంది. న‌య‌న‌తార భాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివ‌న్ తో వెడ్డింగ్ ప్లాన్ కార‌ణంగానే ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేద‌ని కోలీవుడ్ జ‌నాలు గుస‌గుసలాడుకుంటున్నారు. న‌య‌న్ చిరు సినిమాకు వెంట‌నే ఒకే చెప్ప‌క‌పోవ‌డానికి ఇదే కార‌ణ‌మై ఉంటుంద‌నే సందేహాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

సెలెక్టివ్ గా క‌థ‌లు ఎంచుకుని సినిమాలు చేసే న‌య‌న్‌..ఇలా మెగాస్టార్ చిరంజీవిని వెయిటింగ్ లో పెట్టిందన్న వార్త ఇపుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మెహ‌న్‌రాజా ఈ బ్యూటీనే హీరోయిన్ గా ఫైన‌ల్ చేస్తాడా..? నయ‌న్ నో చెబితే ఏ హీరోయిన్ ను సెలెక్ట్ చేస్తాడ‌నేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

సూర్య‌-బోయ‌పాటి కాంబోలో సినిమా..!

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo