సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 23:24:35

అర్బన్‌ మాంక్‌గా మెగాస్టార్‌

అర్బన్‌ మాంక్‌గా మెగాస్టార్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవి శుక్రవారం తన అభిమానుల్ని ఒక్కసారిగా సర్‌ప్రైజ్‌ చేశారు. గుండు చేయించుకొని.. గాగుల్స్‌ ధరించి సరికొత్త ైస్టెలిష్‌ లుక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. చిరు న్యూక్‌లుక్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ ఫొటోకు ‘కెన్‌ ఐ థింక్‌ లైక్‌ ఏ మాంక్‌' (నేను ఒక బౌద్ధ సన్యాసిలా ఆలోచించవొచ్చా?) అనే క్యాప్షన్‌ను పెట్టారు చిరంజీవి. దానికి ‘అర్బన్‌ మాంక్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. భవిష్యత్తులో చేయబోతున్న సినిమాకు సంబంధించి ట్రయల్‌ లుక్‌లో భాగంగా చిరంజీవి ఈ కొత్త అవతారంలో దర్శనమిచ్చారని సమాచారం.logo