ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 18:27:09

వేదాల‌మ్ రీమేక్ లో చిరంజీవి..!

వేదాల‌మ్ రీమేక్ లో చిరంజీవి..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టు గురించి డిస్క‌ష‌న్స్ న‌డుస్తుండ‌గానే..చిరంజీవి చూపు మ‌రో క్రేజీ ప్రాజెక్టుపై ప‌డిన‌ట్టు ఓ వార్త ఇపుడు ఫిలింన‌గ‌ర్ లో హాట్ టాపిక్ గా మారింది. అజిత్ హీరోగా తెర‌కెక్కిన త‌మిళ చిత్రం వేదాల‌మ్‌. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా బాక్సాపీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసింది. చిరంజీవి ఇదే ప్రాజెక్టుని రీమేక్ చేసేందుకు సిద్ద‌మైన‌ట్టు తాజా స‌మాచారం.

డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్ కు ఈ సినిమా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల‌ని చిరు ఫిక్స‌య్యాడ‌ట‌. కేఎస్ రామారావు నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ పై సినిమా చేయాల‌ని ఉంద‌ని చిరు ఇప్ప‌టికే చెప్పాడు. అన్నీ కుదిరితే వేదాల‌మ్ తెలుగు రీమేక్ ను క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. 2013లో వెంక‌టేశ్ హీరోగా వ‌చ్చిన షాడో చిత్రం త‌ర్వాత మ‌రో సినిమా డైరెక్ట్ చేయ‌లేదు మెహ‌ర్ ర‌మేశ్. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo