ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 15:29:07

'క్రాక్' చూసి ఒంగోలు మెమొరీస్ గుర్తుచేసుకున్న చిరంజీవి

'క్రాక్' చూసి ఒంగోలు మెమొరీస్ గుర్తుచేసుకున్న చిరంజీవి

టాలీవుడ్ హీరో ర‌వితేజ న‌టించిన క్రాక్ సినిమా సంక్రాంతి బ‌రిలో నిలిచి క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తోన్న విష‌యం తెలిసిందే. క‌రోనా మహ‌మ్మారితో థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారా..?  లేదా? అన్న అనుమానాల‌కు తెర‌దించుతూ..తెర‌పై త‌న విశ్వ‌రూపం చూపిస్తున్నాడు ర‌వితేజ‌. క్రాక్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లోని హోం థియేటర్ లో వీక్షించాడు. డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనికి శుభాకాంక్షలు చెప్పిన చిరు..త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు.

క్రాక్ సినిమాలో ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో సాగే క‌థ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఒంగోలుతో ఉన్న జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నాడు. తాను ఒంగోలులో చ‌దువుతున్న స‌మ‌యంలో వేట‌పాలెం గ్యాంగ్‌, వారి ఆహార‌పు అల‌వాట్లు గురించి గగుర్పొడిచే విష‌యాలు వినేవాడిన‌ని చెప్పారు. రాత్రి పూట క‌రెంట్ క‌ట్ చేసి..హ‌త్య‌లు చేసిన విష‌యాలు ఆ సమ‌యంలో ఉండేవ‌ని చెప్పుకొచ్చాడు.

త‌న అనుభ‌వాల‌ను గోపీచంద్ మ‌లినేనితో పంచుకున్న చిరు..ఆచార్య సెట్స్ కు ఒక‌సారి రావాల‌ని డైరెక్ట‌ర్ గోపీచంద్ ను ఆహ్వానించాడ‌ట‌. చిరు నుంచి ప్ర‌శంస‌ల‌తోపాటు ఆహ్వానం అంద‌డంతో సంతోషంలో మునిగిపోయారు గోపీచంద్ మ‌లినేని. ర‌వితేజ‌-గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మూడోసారి వ‌చ్చిన క్రాక్ హ్యాట్రిక్ హిట్టు కొట్టింది.

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

క‌మెడీయ‌న్స్ గ్రూప్ ఫొటో.. వైర‌ల్‌గా మారిన పిక్

‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 


ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo