శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 22:06:43

చిరంజీవి మెగా ప్లానింగ్..ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!

చిరంజీవి మెగా ప్లానింగ్..ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!

చిరంజీవి మెగా ప్లానింగ్ తో అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే ఈయన ఇప్పుడు వరస సినిమాలు చేస్తున్నాడు. పదేళ్ళ గ్యాప్ ఒకేసారి భర్తీ చేస్తున్నాడు మెగాస్టార్. ఒకటి రెండు కాదు మూడు నాలుగు సినిమాలు ఒకేసారి కమిట్ అయిపోయి.. అన్నీ పూర్తి చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. తాజాగా సెట్ లోకి రామ్ చరణ్ కూడా వచ్చాడు. ఇన్ని రోజులు ఈయన కోసమే వేచి చూసారు దర్శక నిర్మాతలు. దాంతో ఇప్పుడు చరణ్ రావడంతో నెల రోజుల్లోనే ఆచార్యను పూర్తి చేయాలని చూస్తున్నాడు కొరటాల. ఈ సినిమా కోసం 30 రోజులు డేట్స్ ఇచ్చాడు చరణ్. ట్రిపుల్ ఆర్ షూటింగ్ ఆపేసి మరీ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించాడు రామ్ చరణ్. 

ఇదిలా ఉంటే ఆచార్యతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నాడు చిరు. ఇప్పటికే లూసీఫర్ రీమేక్ తో పాటు వేదాళం రీమేక్ కు కూడా కమిటయ్యాడు చిరు. ఇందులో లూసీఫర్ రీమేక్ బాధ్యతలు మోహన్ రాజా తీసుకున్నాడు. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. జనవరి 21న అధికారికంగా సినిమాను లాంఛ్ చేయనున్నారు. చిరు ఇమేజ్ కు తగ్గట్లుగా కొన్ని మార్పులు కూడా చేసాడు మోహన్ రాజా. హనుమాన్ జంక్షన్ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ తెలుగు సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు జయం రాజా. 

ఇదిలా ఉంటే వేదాళం రీమేక్ మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కథ మెహర్ రమేష్ మార్చేసిన తీరు చిరుకు ఫుల్లుగా నచ్చేసింది. ఈ సినిమాను ఫిబ్రవరిలో పట్టాలెక్కించాలని చూస్తున్నాడు మెగాస్టార్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే..లూసీఫర్, వేదాళం రీమేక్స్ కు ఒకేసారి డేట్స్ ఇచ్చాడు చిరు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రెండు సినిమాలు చాలా తక్కువ సమయంలోనే విడుదల కానున్నాయి. 2021లో ఆచార్యతో పాటు లూసీఫర్ రీమేక్.. 2022 సంక్రాంతికి వేదాళం రీమేక్ విడుదల కానున్నాయని తెలుస్తుంది. ఏదేమైనా కూడా చిరు ప్లానింగ్ మాత్రం అనుకున్నట్లు వర్కవుట్ అయితే అభిమానులకు అంతకంటే పండగ మరోటి ఉండదేమో..?

ఇవి కూడా చ‌ద‌వండి..

సంక్రాంతి హిట్‌పై క‌న్నేసిన సోనూసూద్‌..?

సురేంద‌ర్ రెడ్డికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్

లైట్‌..కెమెరా..యాక్ష‌న్..'ఖిలాడి' సెట్స్ లో ర‌వితేజ‌

డెడ్ లైన్’ పెట్టుకున్న హీరోలు ?

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo