శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 16:37:42

ఆచార్య షూటింగ్ మ‌రో 2 నెల‌లు వాయిదా..!

ఆచార్య షూటింగ్ మ‌రో 2 నెల‌లు వాయిదా..!

టాలీవుడ్ లో ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా..? అని ఎదురుచూస్తున్న‌ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న ఆచార్య ఒక‌టి.  కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ కోవిడ్‌-19 ఎఫెక్ట్ తో వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో సినిమా చిత్రీక‌ర‌ణ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుంతా అనేది దానిపై స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో ఎలాంటి రిస్క్ తీసుకోవ‌ద్ద‌ని కొర‌టాల‌, చిరంజీవి భావిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా మ‌రో 2 నెల‌ల వ‌ర‌కు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. అన్నీ కుదిరితే ‌న‌వంబ‌ర్ 2వ వారం త‌ర్వాత ఆచార్య షూటింగ్ ను షురూ చేయాల‌నుకుంటున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఈ ఏడాది అక్టోబ‌ర్ లో విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా, లాక్ డౌన్ తో సినిమా షూటింగ్స్ నిలిచిపోవ‌డంతో..ఇక 2021 వేసవి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చే అవ‌కాశాలున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.