మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 13:05:02

చిరంజీవి స‌మ‌క్షంలో నాగ‌బాబు బ‌ర్త్‌డే వేడుక‌

చిరంజీవి స‌మ‌క్షంలో నాగ‌బాబు బ‌ర్త్‌డే వేడుక‌

మెగా నాగబ్ర‌ద‌ర్ నాగ‌బాబు అక్టోబ‌ర్ 29,1961న జ‌న్మించారు. నేటితో ఆయ‌న 59వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా మెగా ఫ్యామిలీ స‌భ్యులు, అభిమానులు, శ్రేయాభిలాషులు ఆయ‌న‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు. చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప‌వ‌న్‌,నాగబాబుతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. భావోద్వేగ‌పు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇక కొద్ది సేప‌టి క్రితం చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్‌లో నాగబాబు చేత కేక్ క‌ట్ చేయించి త‌మ్ముడి బ‌ర్త్‌డే వేడుక‌ని ఘ‌నంగా జ‌రిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడితో పాటు ప‌లువురు అభిమానులు పాల్గొన్నారు. ప్ర‌స్తుతం నాగ‌బాబు బ‌ర్త్‌డే వేడుక‌కు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.