మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత ఆయనతో సినిమాలు నిర్మించడానికి చాలా మంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన మాత్రం కేవలం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఖైదీ నెం 150, సైరా నరసింహారెడ్డి.. తాజాగా విడుదలకు సిద్ధమైన ఆచార్య సినిమా కూడా సొంత నిర్మాణ సంస్థలో చేశాడు మెగాస్టార్. ఆచార్య సినిమా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే చిరంజీవితో సినిమాలు చేయడానికి చాలా కాలంగా కొందరు నిర్మాతలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అందులో అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. కానీ చిరు ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి.
సొంత నిర్మాణంలో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి అనేది మెగాస్టార్ మెగా ఆలోచన. అయితే మొన్న పుట్టిన రోజున ప్రకటించిన సినిమాలు మాత్రం వేర్వేరు నిర్మాణ సంస్థలకు చేస్తున్నాడు మెగాస్టార్. మైత్రి మూవీ మేకర్స్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది అలాగే లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాను సూపర్ గుడ్ ఫిలింస్ కు చేస్తున్నాడు చిరంజీవి. మళ్లీ ఇందులో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సహా నిర్మాణ సంస్థగా ఉంది. ఇదిలా ఉంటే వేదాళం రీమేక్ భోళా శంకర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేస్తున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ కూడా సమర్పిస్తోంది. సీనియర్ నిర్మాత కెఎస్ రామారావుపై ఉన్న అభిమానంతోనే ఆయనను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేశాడు మెగాస్టార్ చిరంజీవి.
కొన్నేళ్లుగా క్రియేటివ్ కమర్షియల్స్ నుంచి వస్తున్న సినిమాలు ఆకట్టుకోవడం లేదు. ఈయన నిర్మించిన గత సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ అయింది. దానికి ముందు సాయి తేజ్ హీరోగా వచ్చిన తేజ్ ఐ లవ్ యు కూడా ఫ్లాప్ అయింది. ఆ సమయంలోనే కె.ఎస్.రామారావుతో సినిమా చేస్తానని చిరంజీవి మాటిచ్చాడు. ఈ కాంబినేషన్లో ఒకప్పుడు అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం, రాక్షసుడు, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటి సినిమాలు వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ తనకు ఇష్టమైన నిర్మాతతో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్లో పూర్తి చేయాలని దర్శకుడు మెహర్ రమేష్‌కు కండిషన్ పెట్టాడు చిరంజీవి. ఇందులో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. మరి ఈ సినిమాతో అయినా కె.ఎస్.రామారావు మళ్లీ ఫామ్ లోకి వస్తారా లేదా చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
ఏఎన్నార్ ను ముట్టుకుంటే చర్మం ఊడిపోయేది.. కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Boyapati Sreenu | కేజీఎఫ్ హీరోకు బోయపాటి కథ వినిపించాడా..?
స్నేహితులతో బిజినెస్ మొదలు పెట్టిన కీర్తి సురేష్
దిశా పటానీ బీచ్‌వాక్.. ఇన్‌స్టాలో కొత్త వీడియో