సినీ జర్నలిస్ట్, నటుడు, యూట్యూబ్ ఇంటర్వ్యూయర్ టీఎన్ఆర్ ( TNR ) మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు. తక్షణ ఖర్చుల కోసం లక్ష రూపాయలు సాయం అందజేశారు. టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తుచేశారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. టీఎన్ఆర్ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్ తనదైన మార్గాన్ని ఎంచుకుని ఎదిగారు.
‘మీరంటే వీరాభిమానం సార్. తన 200వ ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారు. ఇంతవరకు మిమ్మల్ని కలవలేదు. మీరు మాకిలా ఫోన్ చేయడం ఎంతో సంతోషం కలిగించింది’ ఈ మాటలు మరెవరివో కాదు టీఎన్ఆర్ సతీమణివి. ఆమె భర్త మరణించిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ఆమెకు ఫోన్ చేసి పరామర్శించగానే ఆమె అన్న మాటలివి. తమ కుటుంబానికి లక్ష రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్‌తో మూవీ పక్కా అంటున్న బండ్ల గణేష్..!
అందరిలానే నాకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి: శృతి హాసన్
కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న సోనూసూద్
ఇళయరాజా సోదరుడి సతీమణి కన్నుమూత
మంచు లక్ష్మీకి షాకిచ్చిన హ్యాకర్స్
అమ్మకు పాజిటివ్ అంటూ ఎమోషనల్ అయిన బిగ్ బాస్ విన్నర్
సోషల్ మీడియాలో రత్తాలు రచ్చ.. మండిపడుతున్న నెటిజన్స్