శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Feb 11, 2021 , 18:29:37

మెగా అల్లుడు హిట్ కొడతాడా..2021లో 3 సినిమాలు

మెగా అల్లుడు హిట్ కొడతాడా..2021లో 3 సినిమాలు

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది వారసులు వచ్చి విజయం అందుకున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. అతడే కళ్యాణ్ దేవ్.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త ఈయన. మూడేళ్ల కింద విజేత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో కళ్యాణ్ దేవ్ గురించి ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ తను ఇంకా ఉన్నాను అని గుర్తు చేసే పనిలో పడ్డాడు మెగా అల్లుడు. రెండో సినిమా కోసం రెండేళ్లకు పైగానే తీసుకున్న కళ్యాణ్.. తనను తాను పూర్తిగా మార్చుకుని వస్తున్నాడు. మేకోవర్ విషయంలో కూడా అస్సలు తగ్గడం లేదు కళ్యాణ్ దేవ్. 

ప్రస్తుతం ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు. పైగా ఈ మూడు సినిమాలు 2021 లో విడుదల కానుండటం విశేషం. ఇప్పటికే సూపర్ మచ్చి షూటింగ్ పూర్తి అయిపోయింది. ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానుంది. ఇందులో కన్నడ బ్యూటీ రచిత రామ్ హీరోయిన్ గా నటిస్తోంది. పులి వాసు ఈ సినిమాకు దర్శకుడు. మరోవైపు అశ్వద్ధామ ఫేమ్ రమణ తేజ తెరకెక్కిస్తున్న కిన్నెరసాని సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈ చిత్ర థీమ్ సాంగ్ ను రామ్ చరణ్ విడుదల చేశాడు. 

ఇక ఫిబ్రవరి 11న కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరో సినిమా అప్ డేట్ కూడా వచ్చింది. రైటర్ శ్రీధర్ సీపాన దర్శకత్వంలో కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఇదే ఏడాది విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ 2 సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా ఈ మూడు సినిమాలతో ఇప్పుడు బిజీ అయిపోయాడు మెగా అల్లుడు. కచ్చితంగా వేటితో హీరోగా గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకుంటానని ధీమాగా చెబుతున్నాడు. మరి చిరు అల్లుడు నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo