రామ్ చరణ్ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 14 ఏళ్లు పూర్తయ్యాయి. 2007లో అభిమానుల కోలాహలం మధ్య.. చిరు తనయుడు చిరుత సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. 2007 సెప్టెంబర్ 28న చరణ్ తొలి సినిమా చిరుత విడుదలైంది. అంటే నేటికి సరిగ్గా 14 ఏళ్లు అయిపోయిందన్నమాట. అప్పుడే చిరుత సినిమా వచ్చి 14 ఏళ్లవుతుందా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి కొడుకు హీరోగా వస్తున్నాడంటే అంచనాలు మామూలుగా ఉండవు కదా.. చిరుత సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు ఉన్న బజ్ మాటల్లో చెప్పడం కష్టమే. బహుశా అప్పటి వరకు ఏ డెబ్యూ హీరో సినిమాకు ఇంత హంగామా జరగలేదేమో..? పోకిరి సినిమాతో సెన్సేషనల్ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ దర్శకుడు.. వారసులను లాంఛ్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన అశ్వినీదత్ లాంటి మెగా నిర్మాత.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్.. ఇవన్నీ చిరుతను హిట్ చేశాయి. తొలి సినిమాతోనే 25 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది చిరుత. చరణ్ కెరీర్‌కు కరెక్ట్ బేస్ వేసింది చిరుత. ఆ తర్వాత మగధీర, రచ్చ, నాయక్, ఎవడు, ధృవ, రంగస్థలం లాంటి మాస్ సినిమాలతో విజయాలు అందుకున్నాడు. మధ్యలో జంజీర్ రీమేక్‌తో బాలీవుడ్ కూడా వెళ్లొచ్చాడు చరణ్. గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాలతో కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు రాజమౌళి, శంకర్ లాంటి పాన్ ఇండియన్ దర్శకులతో పని చేస్తున్నాడు. మరి 14 ఏళ్ల కింద చిరుత సినిమా ఏరియా వైజ్ వసూళ్లు ఒక్కసారి ఇప్పుడు చూద్దాం..
నైజాం: 6.75 కోట్లు
సీడెడ్: 5.60 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.40 కోట్లు
ఈస్ట్: 1.60 కోట్లు
వెస్ట్: 1.65 కోట్లు
గుంటూరు: 2.25 కోట్లు
కృష్ణా: 1.63 కోట్లు
నెల్లూరు: 1.05 కోట్లు
ఏపీ + తెలంగాణ: 22.75 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + కర్ణాటక: 2.02 కోట్లు
ఓవర్సీస్: 30 లక్షలు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 25.15 కోట్లు షేర్
రూ. 9 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు అశ్వినీదత్. డెబ్యూ హీరోకు అంత బడ్జెట్ పెట్టడం ఎక్కువే అయినా కూడా చిరు కొడుకు కాబట్టి కామన్ అయిపోయింది. రామ్ చరణ్ మొదటి సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది. రూ 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఈ చిత్రం 25 కోట్లు షేర్ వసూలు చేసి.. మంచి విజయమే సాధించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కల్యాణ్‌పై మరోసారి ఫైర్ అయిన పోసాని.. చిరంజీవిని పొగుడుతూనే..
మీరు నవ్వితే ప్రపంచం ఆగిపోతుంది..దీపికాపదుకొనే స్టిల్‌పై అభిమాని
తండ్రి, కొడుకుల మధ్య ముదురుతున్న వివాదం.. ఆందోళనలో విజయ్ ఫ్యాన్స్
మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ అంతా నాకే ఓటేస్తారు: మంచు విష్ణు
పుష్ప టీమ్ సర్ప్రైజ్.. రష్మిక మందన్న ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది