మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 17:38:48

మెగా సెంటిమెంట్ ఫాలో అవుతున్న‌ వరుణ్ తేజ్..!

మెగా సెంటిమెంట్ ఫాలో అవుతున్న‌ వరుణ్ తేజ్..!

వరస విజయాలతో జోరు మీదున్నాడు వరుణ్ తేజ్. కెరీర్ మొదట్లో హిట్ కొట్టడానికి కాస్త టైమ్ తీసుకున్నా కూడా ఫిదా తర్వాత మాత్రం ఆయన జోరు తగ్గడం లేదు. ప్రస్తుతం వరుణ్ కెరీర్‌ పీక్స్‌లో ఉంది. ఎఫ్ 2, గద్దలకొండ గణేష్, తొలిప్రేమ, ఫిదా లాంటి విజయాలతో ఈయన మార్కెట్ 40 కోట్లకు చేరుకుంది. మధ్యలో అంతరిక్షం మాత్రమే అంచనాలు అందుకోలేకపోయింది. మిగిలిన సినిమాలన్నీ వరుణ్ మార్కెట్ అమాంతం పెంచేసాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈయన గని సినిమాతో వస్తున్నాడు. ఈ మధ్యే జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా 'గని' చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి మంచి అప్లాజ్ కూడా వచ్చింది. అప్పట్లో బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తొలిప్రేమను వాడుకున్న ఈయన.. ఇప్పుడు కూడా దాదాపు అదే చేసాడు. 

గని పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది బాలు సినిమానే. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయినా కూడా అందులో గని పాత్ర మాత్రం ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అయింది. నిజానికి ఈ సినిమాకు బాలు బదులుగా గని అనే టైటిల్ పర్ఫెక్టుగా సెట్ అయ్యేదని చాలా మంది అంటుంటారు కూడా. అలాంటి టైటిల్ ఇప్పుడు తన సినిమా కోసం వాడేసుకున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మెగా సెంటిమెంట్ వాడుకుంటున్నాడు వరుణ్ తేజ్. గని సినిమాను జులైలో విడుదల చేస్తున్నారు. జులై 30న డేట్ ఖరారు చేస్తూ ప్రకటించారు దర్శక నిర్మాతలు. మెగా హీరోలకు జులై నెల బాగా కలిసొచ్చింది. ఈ నెలలో విడుదలైన కొన్ని సినిమాలు ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాసాయి. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర ఇదే నెలలో వచ్చింది.. దాంతో పాటు పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ క్లాసిక్ తొలిప్రేమ కూడా జులైలోనే విడుదలైంది. ఇక తెలుగు సినిమాకు సరికొత్త మార్కెట్ లెక్కలు చూపించిన మగధీర వచ్చింది కూడా జులైలోనే. అంతెందుకు వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ సోలో బ్లాక్ బస్టర్ ఫిదా కూడా జులై 21, 2017న విడుదలైంది. ఇలాంటి ట్రాక్ రికార్డు ఈ నెలకు ఉంది కాబట్టే ఇప్పుడు ఈయన నటిస్తున్న గని సినిమాను కూడా జులైలోనే విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. మెగా ఫ్యామిలీ మెంబర్ నిర్మాణంలో వరుణ్ చేస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మొత్తానికి మెగా సెంటిమెంట్ వరుణ్ తేజ్ గనికి ఎంతవరకు పనికొస్తుందో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

జాన్వీక‌పూర్ కు 'వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ' న‌చ్చ‌లేదా..?

20 నిమిషాలు..కోటి రెమ్యున‌రేష‌న్..!

శృతిహాస‌న్ ప్రియుడు ఇత‌డే..ఫాలోవ‌ర్స్ కు క్లారిటీ !

అన‌సూయ‌ 'థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ ' ట్రైల‌ర్

‘ఓటిటి’ కాలం మొద‌లైన‌ట్టేనా..?

తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo