శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 17:52:21

డిసెంబర్‌లో సినిమాలు..మెగా హీరోనే ఫ‌స్ట్..!

డిసెంబర్‌లో సినిమాలు..మెగా హీరోనే ఫ‌స్ట్..!

చాలా నెలలుగా థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే వాటిని తెరిచే పనిలో బిజీగా ఉన్నారు ఎగ్జిబిటర్లు. చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ తెరిచి మళ్లీ మూసేసారు కూడా. అయితే తెలంగాణలో కూడా థియేటర్స్ తెరిచేందుకు అనుమతులు వచ్చేసాయి. దాంతో ఇక్కడ కూడా అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా డిసెంబర్ లో కొన్ని సినిమాలు విడుదలయ్యేలా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా కేవలం థియేటర్స్ లో మాత్రమే వస్తామని చెప్పిన ఆ సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే తెలుగులో క్రాక్, ఉప్పెన, రెడ్ లాంటి అరడజన్ సినిమాలు విడుదలకు సిద్ధంగానే ఉన్నాయి కానీ థియేటర్స్ లేక రాలేదు. కొన్ని సినిమాలను ఆన్ లైన్ లోనే విడుదల చేసారు. అయితే వాటికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. 

ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే డిసెంబర్ లో అందరికంటే ముందు సాయి ధరమ్ తేజ్ వస్తున్నాడు. ఈయన నటించిన సోలో బ్రతుకే సో బెటరూ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలని చూస్తున్నారు. అప్పటి వరకు థియేటర్స్ ఓపెన్ చేస్తారా లేదా అనేది అర్థం కావడం లేదు. ఒకవేళ చేస్తే మాత్రం కచ్చితంగా వచ్చే మొదటి సినిమా మాత్రం సాయిదే అవుతుంది. కరోనా కారణంగా జనం ఇప్పుడు బయటికి వచ్చే పరిస్థితులు లేవనడానికి కూడా లేదు. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో కూడా జనం బయటికి భయాల్లేకుండా వచ్చేస్తున్నారు. 

అందుకే థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా ఆడియన్స్ వస్తారనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ సినిమా రానుంది. ఆయనతో పాటు ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా కూడా డిసెంబర్ లోనే విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు.. మరో మూడు నాలుగు సినిమాలను కూడా డిసెంబర్ లోనే తీసుకురావాలని చూస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి చాలా సినిమాలున్నాయి. వాటితో పోటీ ఎందుకని ముందుకు వెనక్కి డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.