శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 12:22:07

గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌లో పాల్గొన్న చిరు, చ‌ర‌ణ్‌, నాగబాబు

గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌లో పాల్గొన్న చిరు, చ‌ర‌ణ్‌, నాగబాబు

దేశ వ్యాప్తంగా గ‌ణ‌తంత్ర వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. భార‌త ప్ర‌జ‌లు జెండాలు ఎగురువేస్తూ జాతీయ భావాన్ని చాటుకుంటున్నారు. తాజాగా చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌లో మెగాస్టార్ చిరు జెండాను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో  చిరంజీవితో పాటు రామ్ చ‌ర‌ణ్‌, నాగ‌బాబు, అల్లు అర‌వింద్ పాల్గొన్నారు. 

అంత‌క‌ముందు చిరు త‌న ట్వీట్ ద్వారా గ‌ణ‌తంత్ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. రిప‌బ్లిక్ డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని విస్తృతంగా రక్త‌దానం చేయ‌సంక‌ల్పించిన మెగా బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌ని మ‌న‌స్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేర‌కు స్పందించి, చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌కు వ‌చ్చి, ర‌క్త‌దానం చేసిన‌, చేస్తున్న రక్త‌దాక్త‌ల‌కు హృద‌య పూర్వక ధ‌న్య‌వాదాలు. ర‌క్త దానం చేయండి, ప్రాణ దాత‌లు కండి అంటూ చిరంజీవి త‌న వాయిస్ వీడియో ద్వారా సందేశాన్ని అందించారు.


VIDEOS

logo