గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 16:33:22

క‌మేడియ‌న్ చ‌మ్మ‌క్ చంద్ర స‌వాల్‌ను స్వీక‌రించిన మెగా బ్ర‌ద‌ర్‌!

క‌మేడియ‌న్ చ‌మ్మ‌క్ చంద్ర స‌వాల్‌ను స్వీక‌రించిన మెగా బ్ర‌ద‌ర్‌!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ దేశ వ్యాప్తంగా మంచి స్పంద‌న ల‌భించింది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన‌డానికి చాలామంది మొగ్గుచూపుతున్నారు. రాజ‌కీయ‌నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు, క్రీడాకారులు ఇలా రంగంతో సంబంధం లేకుండా ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌బ‌ర్థ‌స్ట్ క‌మేడియ‌న్ చ‌మ్మ‌క్ చంద్ర విసిరిన ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తూ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మ‌ణికొండ‌లోని త‌న నివాసంలో మొక్క‌లు నాటారు.

సంతోష్ కుమార్‌గారు ప్రారంభించిన గొప్ప కార్య‌క్ర‌మంలో ప్ర‌తిఒక్క‌రినీ భాగ‌స్వాములు చేసినందుకు కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు నాగ‌బాబు. అయితే ఈ గొప్ప ప‌నికి మ‌రో ఇద్ద‌రిని నామినేట్ చేశారు నాగ‌బాబు. న‌టుడు భ‌ర‌ణి, క‌లికి రాజ్‌ల‌కు స‌వాలు విసిరారు. వీరిద్ద‌రు ఛాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటాల‌ని కోరారు. అలాగే ఈ ప‌ద్ధ‌తి ఇలానే కొన‌సాగాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకున్నారు నాగ‌బాబు. ‌ logo