మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 11:04:53

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్‌!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్‌!

క‌రోనా సినీ ఇండ‌స్ట్రీని టార్గెట్ చేసింది. లెజండ‌రీ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి వారు క‌రోనా బారిన ప‌డ్డారు. ఇప్పుడు క‌రోనా మెగా ఫ్యామిలీ మీద క‌న్నేసింది. నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ అయింది. అయితే దీనికి గురించి నాగ‌బాబు నోరు విప్ప‌క‌ముందే రెండు రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

ఇప్పుడు ట్విట‌ర్ వేధిక‌గా నాగ‌బాబు విష‌యాన్ని వెల్ల‌డించారు. తొంద‌ర‌గా క‌రోనాను జ‌యించి ప్లాస్మాను దానం చేస్తాన‌ని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే నాగ‌బాబు గ‌త కొన్నిరోజులుగా ఓ ఛాన‌ల్‌లో వ‌చ్చే కామెడీ షోలో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. బ‌హుశా అక్క‌డి నుంచే వైర‌స్ సోకి ఉండొచ్చు అంటున్నారు. ఏదేమైనా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నాగ‌బాబు సూచించారు. నాగ‌బాబు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అత‌ని అభిమానులు రీట్వీట్లు పెడుతున్నారు.


logo