ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 23, 2021 , 11:54:18

మెగా బ్ర‌ద‌ర్ ఫ్యామిలీ పిక్ అదుర్స్!

మెగా బ్ర‌ద‌ర్ ఫ్యామిలీ పిక్ అదుర్స్!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో త‌న ముద్దుల కూతురు నిహారిక పెళ్ళి వేడుక‌ని ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా ఘ‌నంగా జ‌రిపిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా ఈ పెళ్లి లో సంద‌డి చేయ‌గా ఫోటోలు ఫుల్ వైర‌ల్ అయ్యాయి. ఇక త్వ‌ర‌లో వ‌రుణ్ తేజ్ పెళ్లి కూడా జ‌ర‌గ‌నుండ‌గా, అతను చేసుకోబోయే అమ్మాయి ఎవ‌రు అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

ప్ర‌స్తుతం మెగా బ్ర‌ద‌ర్ ఫ్యామిలీ చాలా రిలాక్డ్స్ మూడ్‌లో ఉన్నారు. వ‌రుణ్ తేజ్ తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో  ఆయ‌న త‌ల్లి,తండ్రి నాగ‌బాబు, సోద‌రి నిహారిక తో క‌లిసి దిగిన ఫొటోని షేర్ చేయ‌గా అంద‌రు ముసిముసి న‌వ్వులు న‌వ్వుతూ క‌నిపించ‌గా, నిహారిక మాత్రం ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతుంది. మ‌రి అక్క‌డ జ‌రిగిన ఆ కామెడీ ఏంట‌నేది ప్ర‌స్తుతానికి సస్పెన్స్. కాగా, వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం గ‌ని చిత్రంతో పాటు ఎఫ్ 3 అనే సినిమా చేస్తున్నాడు.

VIDEOS

logo