స్వీయ నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని సమర్పణలో రూపొందిస్తున్న ‘మీట్ క్యూట్’ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. సీనియర్ నటుడు సత్యరాజ్‌పై తెరకెక్కించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్‌కొట్టారు. ‘వాల్‌పోస్టర్ పతాకంపై నిర్మిస్తున్న నాలుగో చిత్రమిది. ఈ కొత్త ప్రయాణం చాలా ప్రత్యేకమైనది’ అని నాని ట్విట్టర్లో పేర్కొన్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ప్రముఖ కథానాయికలు నటించబోతున్నారని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వసంత్‌కుమార్, ఆర్ట్: అవినాష్ కొల్ల, సంగీతం: విజయ్ బుల్గనిన్, సమర్పణ: నాని, రచన-దర్శకత్వం: దీప్తి గంటా.