శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Dec 22, 2020 , 09:38:04

జ‌న‌వ‌రిలో సందడి చేసేందుకు వ‌స్తున్న అల్ల‌రోడు

జ‌న‌వ‌రిలో సందడి చేసేందుకు వ‌స్తున్న అల్ల‌రోడు

కొన్నాళ్ళుగా స‌రైన హిట్ లేక అవ‌స్ధ‌లు ప‌డుతున్న అల్ల‌రి న‌రేష్ రీసెంట్‌గా  ‘బంగారు బుల్లోడు’ అనే చిత్రం చేశారు. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.వి.గిరి దర్శకుడు. పూజా ఝవేరి కథానాయిక. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల కాగా, దీనిని బ‌ట్టి ఈ చిత్రం  ‘బ్యాంక్‌ నగల అదృశ్యం నేపథ్యంలో వినోదం, ప్రేమ, సస్పెన్స్‌, సెంటిమెంట్‌ అంశాలతో రూపొందిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. 

న‌రేష్ బ్యాంక్ ఉద్యోగి పాత్ర‌లో క‌డుపుబ్బ న‌వ్వించ‌నున్నారు. తనికెళ్లభరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్‌, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తిక్ సంగీతం అందించారు. కరోనా వ‌ల‌న ఇన్నాళ్ళు థియేట‌ర్‌లోకి రాకుండా ఆగిన బంగారు బుల్లోడు చిత్రం జ‌న‌వ‌రి 2021లో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మైంది. కొద్ది సేప‌టి క్రితం ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే  ఈచిత్ర రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నారు.

ఇవి కూడా చ‌దవండి

ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడి సినిమాలో పాయ‌ల్‌కు ఛాన్స్


సంగారెడ్డి జిల్లాలో విషాదం.. విషాహారం తిని ముగ్గురు మృతి


ప్రియాంక చోప్రా-రాజ్‌కుమార్ రావు ది వైట్ టైగ‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల‌


VIDEOS

logo