శుక్రవారం 03 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 09:21:54

కంగ‌నా..నీకు జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో న‌టించే అర్హ‌త లేదు!

కంగ‌నా..నీకు జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో న‌టించే అర్హ‌త లేదు!

బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్‌.. దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న త‌లైవీ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప‌లు భాష‌ల‌లో విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రంలో న‌టించే అర్హ‌త కంగ‌నా ర‌నౌత్‌కి లేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది త‌మిళ న‌టి మీరా మిథున్. త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా కంగ‌నాపై నిప్పులు చెరిగింది.

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత కంగ‌నా.. నెపోటిజంపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రు బాలీవుడ్ పెద్ద‌ల వ‌ల‌న‌నే సుశాంత్ డిప్రెష‌న్‌కి గురై సూసైడ్ చేసుకున్నాడ‌ని పేర్కొంది. అయితే ఈ నెపోజిటం అనే ప‌దం కొద్ది రోజులుగా ఇంట‌ర్నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా, ఈ పదాన్ని తమిళ సినిమాకు ఆపాదించే వ్యక్తులు కూడా ఉన్నారు. త‌మిళ న‌టి మీరా మిథున్ తన ట్విట్టర్‌లో తాను నెపోటిజం బాధితురాలినేన‌ని కంగ‌నాపై విరుచుకుప‌డింది. 

జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి కంగ‌నాకి ఏం అర్హ‌త ఉంది. ఏం చూసి ఆమెని ఎంపిక చేసుకున్నారు. కోలీవుడ్‌లో న‌డుస్తున్న రాజ‌కీయాలే దీనికి ప్ర‌ధాన కార‌ణం అని మీరా పేర్కొంది. నా రాష్ట్ర సీఎం పాత్ర‌లో పోషించ‌డానికి నువ్వు అన‌ర్హురాలివి. షేమ్ ఫ‌ర్ మై లేట్ బిల‌వుడ్ సీఎం అంటూ కంగ‌నాపై నిప్పులు చెరిగింది మీరా మిథున్‌. దీనిపై కంగానా ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. 


logo